కాంగ్రెస్ నేతల భూ అక్రమాలు బయటపెడదాం..తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పార్టీ లీడర్లతో కేటీఆర్, హరీశ్ రావు 

కాంగ్రెస్ నేతల భూ అక్రమాలు బయటపెడదాం..తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పార్టీ లీడర్లతో కేటీఆర్, హరీశ్ రావు 

హైదరాబాద్, వెలుగు: అధికార కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఫాంహౌస్ పర్యటనలు, అసెంబ్లీలో సభ్యుల సస్పెన్షన్, తాజా రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయ్యింది. తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం, అధికార పార్టీ దాడులను తిప్పికొట్టడమే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ నేతలే టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కాంగ్రెస్ బృందాలు చేపడుతున్న ఫాంహౌస్ పర్యటనలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని గులాబీ నేతలు నిర్ణయించారు. నిబంధనల ప్రకారమే నిర్మాణాలు ఉన్నప్పటికీ.. కావాలనే రాజకీయ కక్షతో రచ్చ చేస్తున్నారని మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అభిప్రాయపడినట్టు సమాచారం.

కాంగ్రెస్ నేతలకు సంబంధించిన అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలపై ఆధారాలతో సహా బయటపెట్టి ఎదురుదాడి చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు చెప్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తమ ఎమ్మెల్యేలపై అక్రమంగా సస్పెన్షన్ వేటు వేశారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడే గొంతు నొక్కేసినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదని, నేరుగా ప్రజాక్షేత్రంలోకే వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని తీర్మానించినట్టు సమాచారం. దానం నాగేందర్ ను హై కోర్టు అనర్హుడిగా ప్రకటించడంతో.. మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఏం చేయాలన్నదానిపైనా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది.